
- నిరుడు మృతుడి భార్య కూడా ఇదే వ్యాధితో మరణం
- అనాథలైన ఇద్దరు కొడుకులు
నర్సింహులపేట,వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజార జీపీలోని లాలితండాలో గుగులోత్ లకుపతి(36) గురువారం కిడ్నీలు ఫెయిలయ్యి చనిపోయాడు. నిరుడు అతడి భార్య కూడా కిడ్నీలు ఫెయిలై మరణించింది. తండాకు చెందిన గుగులోత్ లకుపతి, మంజుల భార్యాభర్తలు. 18 ఏండ్ల కింద వీరికి పెండ్లి కాగా ఇద్దరు కొడుకులు హరిప్రసాద్, జీవన్ ఉన్నారు.
తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకునేవారు. నిరుడు మంజుల రెండు కిడ్నీలు ఫెయిలై చనిపోయింది. ఏడాదికే భర్త లకుపతి అదే వ్యాధితో మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కొడుకు ఇంటర్, చిన్న కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.