
కంది, వెలుగు: యూకే వెళ్లేందుకు వీసా రాలేదని సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంద్రకరణ్ పీఎస్ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండలం ఎద్దు మైలారం గ్రామానికి చెందిన కంతి జితేందర్ కుమార్ గౌడ్ చిన్న కొడుకు అనిల్ కుమార్ గౌడ్(22) డిప్లొమా పూర్తిచేసి, యూకేకు వెళ్లేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వీసా రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఉరివేసుకున్నాడు. జితేందర్ కుమార్ ఇంటికి వచ్చి చూడగా డోర్లోపల నుంచి గడి పెట్టి ఉండడాన్ని గమనించి, పక్కనే ఉన్న జాలీ డోర్ నుంచి ఇంట్లోకి తొంగి చూశాడు. అనిల్చనిపోయి ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటాన్ని చూసి బోరున విలపించాడు. వీసా రాకపోవడంతోనే ఇలా చేశాడని జితేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇంద్రకరణ్పోలీసులు కేసు నమోదు చేశారు.