
అనంతపురం: నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొదుపు గ్రూప్ లో ఉన్న తన తల్లికి రావాల్సిన డబ్బుల విషయంలో అధికారులెవరూ పట్టించుకోవడం లేదంటూ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. కలెక్టరేట్ లో కూడా సరైన సమాధానం లభించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. బాటిల్ లో పెట్రోల్ తెచ్చుకుని.. కలెక్టరేట్ ఎదుట నిలబడి పోసుకుని వెంటనే నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతూ కేకలు వేయడం చూసిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 50 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.