ములుగు, వెలుగు : మద్యం మత్తులో లైజాల్ తాగిన ఓ వ్యక్తి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన అరుణ 2014లో హైదరాబాద్‌కు చెందిన పల్లకి శ్రీనివాస్‌రెడ్డిని కులాంతర వివాహం చేసుకుంది. 2015లో జంగాలపల్లికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీనివాస్‌రెడ్డి కూలీ పని చేస్తుండగా, అరుణ ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తోంది.
మద్యానికి బానిసైన శ్రీనివాస్‌రెడ్డి తరచూ భార్యా, పిల్లలను కొడుతుండేవాడు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి ఆ మత్తులో లైజాల్ తాగాడు. గమనించిన అరుణ వెంటనే ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.