మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా గాంజా నేరస్తులు పట్టుబడుతున్నారు. శనివారం 12 మంది గాంజా నేరస్తులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. శక్తి విజయ్ కుమార్ అనే వ్యక్తి.. ధూల్ పేట నుంచి తక్కువ ధరకు గాంజాను తీసుకొచ్చి.. చెన్నాపురంలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో దాచి పెడుతున్నాడని పోలీసులు చెప్పారు.
అవసరమున్న వారికి నిందితుడు విజయ్ కుమార్ ఎక్కువ ధరకు గాంజాను అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. గబ్బిలాల పేట ప్రాంతంలో రైడ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గాంజా అమ్ముతున్న కేసులో 2017లో మైలార్ దేవులపల్లి పీఎస్ పరిధిలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారని చెప్పారు. 2022 ఆగస్టులో జవహర్ నగర్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామన్నారు. నిందితుని వద్ద నుంచి పోలీసులు 1.5 కేజీల గంజాయిని సీజ్ చేశారు.