రంగారెడ్డి జిల్లా : దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. పేస్ట్ రూపంలో ఉన్న గోల్డ్ బయటపడింది. లోదుస్తులు, ప్యాంటు, చొక్కాలో దాచిపెట్టిన బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 704 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.39.66 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.