
- ఎన్నికల అధికారిని కోరిన కాంగ్రెస్ నేతలు
పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: ఓటరు లిస్టులో దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల అధికారి దేవుజాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు.
గత ఎన్నికల ముందు 15 వేల దొంగఓట్లను తొలగించినట్లు గుర్తుచేశారు. బూత్ ల వద్ద భద్రతను పెంచాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు తొలగించిన ఓటర్ల లిస్టు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, అతిక్, యువరాజ్ మోరే, కిషన్, తిరుపతిరెడ్డి, రతన్ సింగ్, మల్లేశ్, అంజయ్య, రాములు, శ్రీనివాస్, అశోక్పాల్గొన్నారు.