దోశ గొంతులో ఇరుక్కుని హోటల్‌లో వ్యక్తి మృతి

దోశ గొంతులో ఇరుక్కుని హోటల్‌లో వ్యక్తి మృతి

కల్వకుర్తి, వెలుగు : దోశ ముక్క గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఓ వ్యక్తి చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. నాగర్‌‌‌‌ కర్నూల్​జిల్లా కల్వకుర్తిలోని సుభాశ్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం హోటల్‌‌‌‌కు వెళ్లి దోశ ఇంటికి తెచ్చుకొని తింటున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయాడు. కుటుంబసభ్యుల ముందే ఘటన జరగడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.