ఒకే ఒక్క కార్డు.. 30 శాఖల సమాచారం ఇచ్చేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

ఒకే ఒక్క కార్డు.. 30 శాఖల సమాచారం ఇచ్చేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందే కుటుంబాల వివరాలు అంతా ఒకే చోట క్రోడికరించడమే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  మొత్తం 30 ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒకే క్లిక్, ఒకే చోట ప్రభుత్వ అధికారులకు ఈ పథకంతో అందుబాటులో రానుందని ఆయన తెలిపారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డు, రేషన్ కార్డు రెండూ వేర్వేరని.. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. 

ALSO READ : పిచ్చి కుక్క కరిస్తే సచ్చేటోళ్లకు.. బుల్డోజర్లు అవసరమా : సీఎం రేవంత్ సెటైర్లు

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ అందిస్తాము. డిజిటల్ కార్డ్ లో కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. ప్రజల సంక్షేమం కోసమే వన్ స్టేట్, వన్ కార్డ్ పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పథకాన్ని ప్రారంభించాము.

 

 

 

 

  • Beta
Beta feature