12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని పోస్టు మాస్టర్ ఆత్మహత్య

కట్టంగూర్ (నకిరేకల్ ), వెలుగు :  మరో 12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఓ పోస్టు మాస్టర్ ఆత్మహత్య చేసుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ చెందిన దేవరపల్లి యమున(30) నల్గొండ జిల్లా కట్టంగూర్‌‌ మండలంలోని ఐటిపాముల బ్రాంచ్ పోస్టుమాస్టర్‌‌గా పనిచేస్తోంది. ఈమె ఎనిమిది నెలలుగా గ్రామంలోని ఓ ఇంట్లో రెంట్‌కు ఉంటూ డ్యూటీ చేస్తోంది.  ఈనెల 16న యమున వివాహం జరగాల్సి ఉంది.  

ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గాని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో గ్రామస్తులు వెళ్లి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో నల్గొండలోని ఆమె  బంధువులకు  సమాచారం ఇచ్చారు. వాళ్లు  వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు చున్నితో  ఉరి వేసుకొని  కనిపించింది.  దీంతో వాళ్లు  యమున సోదరుడు దుర్గా ప్రసాద్ చెప్పగా.. మృతిపై  అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో ఎస్సై సంఘటన స్థలాన్ని  సందర్శించి  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.