ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ఎంత పెద్ద డైలాగ్ నైనా అవలీలగా చెప్పే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. డైలాగ్స్ మాత్రమే కాదు నటనలోనూ ఆయన్ను బీట్ చేసే నటుడు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సైతం ఓపెన్ గానే ఒప్పుకున్నారు.
అందుకే ఎన్టీఆర్ సినిమాల్లో హై వోల్టేజ్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు మేకర్స్. ఇక ఎన్టీఆర్ హీరోగా వస్తన్న NTR30 మూవీలోనూ మరోసారి అదే సీన్ రిపీట్ కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాలతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కూడా పవర్ ఫుల్ సీన్స్ తో పాటు, అదిరిపోయే డైలాగ్స్ ఉండనున్నాయట. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక డైలాగ్ లీక్ అయ్యింది.
ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. "యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించను" అంటూ తారక్ పలికే ఈ డైలాగ్ బయటకు వచ్చింది. జస్ట్ డైలాగే ఈ రేంజ్ లో ఉందంటే.. ఆ డైలాగ్ ని ఎన్టీఆర్ నోటి వెంట వింటే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. మరి.. ఈ డైలాగ్ సినిమాలో ఏ సందర్భంలో వస్తుందో.? అది ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.