ములకలపల్లి, వెలుగు : అంబుల్సెన్లోనే ఓ గర్భిణి డెలివరీ అయింది. మండలంలోని పాత గుండాలపా డు శివారు చింతలపాడు గ్రామానికి చెందిన రాజే శ్వరి(24)కి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. మండల కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతలపాడుకు సరైన రవాణా సౌకర్యం లేదు.
దీంతో ఆశా వర్కర్ 108 అంబులెన్స్కు కాల్ చేశారు. పైలెట్ తిరుపతి, ఈఎంటీ దుర్గాభవాని చింతల పాడు గ్రామానికి చేరుకున్నారు. రాజేశ్వరిని అంబులెన్స్ లోఎక్కించుకొని భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్ను రోడ్డు పక్కన ఆపి అందులోనే డెలివరీ చేశారు. అనంతరం బూర్గంపాడు పీహెచ్సీలో తల్లీబిడ్డను అడ్మిట్ చేశారు. ఇద్దరూ ఆరో గ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.