
ఇచ్చోడ, వెలుగు : సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణి ఎడ్లబండిపై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి హాస్పిటల్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఇచ్చోడ మండలంలోని బావోజీపేట గ్రామానికి చెందిన అనితకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఆమెను ఎడ్లబండిపై నాలుగు కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో ఇచ్చోడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
అప్పటికే సాయంత్రం కావడంతో హాస్పిటల్‌లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, అక్కడి నుంచి 108లో రాత్రి 7 గంటలకు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.