108 వాహనంలో గర్భిణికి ప్రసవం.. ఆపద్బాంధవులుగా మారిన సిబ్బంది

పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్తుండగా సిబ్బంది ప్రసవం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన చెర్ల లావణ్య అనే గర్భిణికి వేకువజామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పారు. దీంతో108 వాహనంలో లావణ్యను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో లావణ్యకు నొప్పులు ఎక్కువయ్యాయి. 

ALSO READ: గృహలక్ష్మి .. మహాలక్ష్మి ఒక్కరే!!

వెంటనే ఆమెకు 108 వాహనంలో పనిచేసే ఈఎంటి రామ్,పైలట్ మహేష్ పురుడు పోశారు. లావణ్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆపద సమయంలో ఆపద్బాంధవులుగా మారిన 108 సిబ్బందిని లావణ్య బంధువులతో పాటు మేనేజర్ సలీం, సూపర్ వైజర్ రాజశేఖర్ అభినందించారు. రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం అన్ని వేళాల వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.