పెద్దమందడి, వెలుగు: ప్రధాని మోదీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా వచ్చే నెల 1న నిర్వహిస్తున్న బహిరంగ సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశాన్ని మండలంలోని చిల్కటోనిపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలంటే ప్రతి బూత్‌లో 32 మంది సభ్యులతో కమిటీలు పూర్తి చేయాలన్నారు.
ప్రతి గ్రామం నుంచి ప్రజలను తరలించి సభను విజయవంతం చేయాలన్నారు. ప్రధాని జిల్లాకు రావడం చాలా అదృష్టమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, మున్న రవీందర్, సర్వేశ్వర్ రెడ్డి, బోసుపల్లి ప్రతాప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జింకల కృష్ణయ్య, నారాయణ, మాధవరెడ్డి, రామన్ గౌడ్, కేతూరి బుడ్డన్న, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, కుమారస్వామి, రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మోదీ సభను విజయవంతం చేద్దాం
మక్తల్: పాలమూరులో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని బీజేపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి జలందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నర్వలో కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మీటింగ్‌కు నాయకులు, ప్రజా ప్రతినిధులు శక్తి కేంద్రాల ఇన్ చా ర్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు, తరలిరావాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మాదిరెడ్డి రవీందర్ రెడ్డి, సర్పంచ్ సంధ్య ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఎనుముల నరసింహారెడ్డి, నాయకులు కురువ సత్యం, అయ్యన్న, వావిళ్ల నరేందర్ రెడ్డి, వావిళ్ల రవికుమార్ రెడ్డి, రాయచూరు శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.
హెలీప్యాడ్ కోసం స్థల పరిశీలన
భూత్పూర్: అక్టోబర్ 1న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ శివారులో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు. బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన వెంట సీఐ రామకృష్ణ, ఎస్సై శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, సుదర్శన్ రెడ్డి, రాంరెడ్డి, రవీందర్, ఫారూఖ్ తదితరులు ఉన్నారు.