మధ్యప్రదేశ్లో  ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

ఝల్లార్: మధ్యప్రదేశ్ లో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  11 మంది చనిపోయారు. బేతుల్ జిల్లా ఝల్లార్  దగ్గర్లో ఓ ప్రైవేటు బస్సు,  టవేరా (ఎస్ యూ వీ)  వాహనం ఢీకొనడంతో  ఈ ప్రమాదం  జరిగింది. కారులో ప్రయాణించిన వారిలో 11 మంది చనిపోయినట్లు సమాచారం. మృతులు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కల్మట్టలో పనిచేస్తున్న కార్మికులేనని తెలుస్తోంది.  పోలీస్  సిబ్బంది, జిల్లా  కలెక్టర్ సంఘటనా  స్థలానికి చేరుకొని  గాయపడ్డ వారిని  దగ్గర్లోని  హాస్పిటల్ లో  చేర్పించారు.  

 ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి.. రూ 2లక్షల ఎక్స్ గ్రేషియా

మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా.. అలాగే గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.