బాల్కొండ, వెలుగు : ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టడంతో 13 మంది స్టూడెంట్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం కారేపల్లి వద్ద సోమవారం జరిగింది. కృష్ణవేణి స్కూల్‌కు చెందిన బస్సు భీంగల్ పట్టణంలో స్టూడెంట్లను ఎక్కించుకొని వెళ్తోంది.
కారేపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు స్టూడెంట్లు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు గేర్ రాడ్ పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని తెలిసింది.