జగిత్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. జగిత్యాల రూరల్ మండలం పోలస చౌరస్తా దగ్గర రెండు టూ వీలర్స్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన బైండ్ల లచ్చన్న అనే వ్యక్తి మనువడు మల్లికార్జున్(10), మనవరాలు శ్రీనిధి (13) తో ధర్మపురి నుండి తిరుగి వస్తున్నారు.
అల్లిపూర్ లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి లచ్చన్న మనువడు, మనుమరాలుని తీసుకెళుతున్నారు. టూ వీలర్ పై ప్రయాణిస్తున్న తాత భైండ్ల లచ్చన్న, మనుమరాలు శ్రీనిధి ఇద్దరు స్పాట్స్ లోనే మృతి చెందారు. మనుమడు మల్లికార్జున్ కు తీవ్ర గాయలు అయ్యాయి ఆస్పత్రికి తరలించారు.
ALSO READ | రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
లచ్చన్న మనవడికి గాయాల పాలైయ్యాడు. బస్సు ఓ బైక్ ను తొక్కుకుంటూ వెళ్ళడంతో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యయి. మరో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యారు.. వారిని జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రవేట్ బస్సు డ్రైవర్ పరార్ కావడంతో ప్రయాణికుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. హైదరాబాదు లోని అంబర్ పేట్ వైశ్య సంఘానికి చెందిన 54 మంది ట్రావెలర్ బస్సులో వేములవాడకు వచ్చి కొండగట్టు దర్శనం చేసుకున్నారు. అనంతరం ధర్మపురి వెళ్తుండగా ఈ ఘనట జరిగింది. పోలీసులు యాక్సిడెం్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.