అర్ధరాత్రి వంటగదిలో నుంచి శబ్దాలు.. ఏంటా అని చూస్తే ఫ్రిడ్జ్పై 12 అడుగుల భారీ కొండ చిలువ

అర్ధరాత్రి వంటగదిలో నుంచి శబ్దాలు.. ఏంటా అని చూస్తే  ఫ్రిడ్జ్పై 12 అడుగుల భారీ కొండ చిలువ

కరీంనగర్: కరీంనగర్ మంకమ్మ తోటలోని నరసన్న అనే వ్యక్తి ఇంట్లోకి కొండచిలువ చొరబడింది. అర్ధరాత్రి కిచెన్లోకి చొరబడిన 12 అడుగుల భారీ కొండచిలువ ఫ్రిడ్జ్ పైకి ఎక్కింది. వంట గదిలోంచి శబ్దాలు రావడంతో వెళ్లి చూసి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించి కొండచిలువను పట్టించారు. కొండచిలువను తీసుకెళ్లి స్నేక్ క్యాచర్ అడవిలో వదిలేయడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఇటీవల.. కొండచిలువలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి.

 

ఇటీవలే మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీస్ స్టేషన్లోకి భారీ కొండచిలువ వచ్చింది. పోలీస్ స్టేషన్ ప్రహరీ ముళ్లకంచెలో చిక్కుకొని చాలాసేపు పాపం నరకయాతన అనుభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్నేక్ క్యాచర్కి సమాచారం అందించారు. ముళ్ల పెన్సింగ్కు చిక్కుకోవడం వల్ల కొండచిలువకు రక్తస్రావం అయ్యింది. అటవీ అధికారులు స్నేక్ క్యాచర్ సహాయంతో కొండచిలువను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కొండచిలువకు ప్రథమ చికిత్స చేసి రెండుచోట్ల తెగిన శరీరానికి కుట్లు వేసి పాముని డాక్టర్లు రక్షించారు. ఆ తర్వాత జిల్లా అటవీ శాఖ అధికారులు కొండచిలువను ఎల్లారం ఫారెస్ట్ రేంజ్లో వదిలిపెట్టారు.

ALSO READ | నల్లమల్ల అడవిలో చిరుత మృతదేహం కలకలం