నల్లగొండ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రూ. 35 లక్షల విలువ గల 1 క్వింటాల్నర గంజాయిని పట్టుకున్నారు. ఈ సంధర్బంగా ఎస్పీ మాట్లాడుతూ నూనవత్ జగన్ అనే వ్యక్తి ని అరెస్ట్ చేశామని చెప్పారు. రెండు కార్లు స్వాదీనం చేసుకున్నామన్నారు.
మరో నలుగురు నిందితులు పరారిలో ఉన్నారని తెలిపారు. నూనావత్ మంచ్యా నాయక్, ఆంగోతు నాగరాజు,బాణోతు సాయి, భూక్యా రాము కోసం పోలీస్ టీం వెతుకుతున్నారని తెలిపారు. జిల్లా పై నిరంతర నిఘా పెట్టామని గంజాయి లాంటి మాధకద్రవ్యాలు తెస్తే కఠినంగా ఉంటామని చెప్పారు ఎస్పీ శరత్ చంద్ర పవార్.