ఖమ్మం మార్కెట్లో 23వేలు పలికిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి పంటకు అత్యధిక ధర పలికింది. జెండా పాటగా క్వింటాల్ మిర్చికి 23 వేల300 రూపాయల ధర నిర్ణయించారు అధికారులు. ఇవాళ దాదాపు 15 వందలకు పైగా మిర్చి బస్తాలు మార్కెట్ కు వచ్చాయి.

అయితే వ్యాపారులు పంట క్వాలిటీని బట్టి ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. గరిష్ట ధర 23వేల 300 రూపాయలు పలుకగా..  రంగు మారిన మిర్చిని వ్యాపారులు కేవలం 12 వేల నుంచి 13 వేల ధర చెల్లించి కొనుగోలు చేశారు.