ఆటో డ్రైవర్లను సర్కార్​ ఆదుకోవాలి

జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంలో  డీజిల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ తీశారు. ఆటోలతో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  

చొప్పదండి, రాయికల్, మల్యాల, గొల్లపల్లి :  చొప్పదండి పట్టణంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆటోలతో నిరసన ర్యాలీ చేపట్టారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రతి నెల రూ.15వేల భృతితో పాటు రూ.10లక్షల ఇన్స్​రెన్స్​ సౌకర్యం కల్పించాలని కోరారు.  రాయికల మండలకేంద్రంలో ఆటోడ్రైవర్ల నిరసనకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​శ్రేణులు మద్దతు తెలిపారు.  మల్యాల, గొల్లపల్లి మండలకేంద్రాల్లోనూ ఆటోడ్రైవర్లు ఆందోళన చేశారు.