వరంగల్, వెలుగు : వరంగల్ హంటర్ రోడ్డులోని కోడం కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం సీఎంఆర్ ఆధ్వర్యంలో ర్యాంప్ వాక్ నిర్వహించారు. యూత్, పిల్లలు తమ స్టైల్స్, డ్రెస్సింగ్‌తో అలరించారు. కార్యక్రమానికి జడ్జీలుగా డాక్టర్ అనూష, డాక్టర్ శృతి వ్యవహరించారు.
ప్రతిభ కనబరిచిన నలుగురికి మిస్టర్ సీఎంఆర్, మిస్, సీఎంఆర్, సీఎంఆర్ ప్రిన్స్, సీఎంఆర్ ప్రిన్సెస్ టైటిల్స్ అందజేశారు. ఫస్ట్ ప్రైజ్ కింద రూ. 20 వేలు, సెకండ్ ప్రైజ్ రూ.10 వేలు, థర్డ్ ప్రైజ్ కింద రూ. 6 వేలతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు.