
జడ్చర్ల, వెలుగు: పట్టణంలోని బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ ఆవరణలోని బొటానికల్ గార్డెన్ లో అరుదైన బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ పుష్పించినట్లు ప్రిన్సిపాల్ సుకన్య తెలిపారు. ఈ మొక్కను కాలేజీ బాటనీ లెక్చరర్ సదాశివయ్య, ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కాలేజీ లెక్చరర్ ప్రసాద్ 2020లో గుర్తించి బ్రాకిస్టెల్మా బైలోబేమ్గా నామకర ణం చేసినట్లు చెప్పారు.
ఈ మొక్క నల్లమల ప్రాంతంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించదని, సన్నని కాండంతో 25 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుందని తెలిపారు. ప్రతి కనుపు వద్ద తెల్లని కేశాలు గల రెండు ముదురు ఎరుపు, నల్లని పుష్పాలు పూస్తాయని గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య తెలిపారు.