జడ్చర్ల, వెలుగు : జడ్చర్లలో అరుదైన చేప వెలుగు చూసింది. చేపను పట్టుకుంటే రాయి మాదిరిగా గట్టిగా ఉండి, ఒంటిపై చిన్న ముళ్లతో చూడడానికి అందంగా కనిపిస్తోందని జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదా శివయ్య తెలిపారు. జడ్చర్ల సెయింట్ పాల్ హైస్కూల్ లో 8వ తరగతి స్టూడెంట్ సాయి చరణ్ తన ఇంట్లో ఉన్న చేప గురించి ఆయనకు చెప్పగా, కాలేజీకి తెప్పించుకుని చేపను పరిశీలించారు.
హైపోస్టోమస్, ప్లేకోస్టోమస్ అనే విదేశీ చేపగా గుర్తించారు. దీన్ని సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అని కూడా అంటారని చెప్పా రు. ఈ చేపలు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందినవని, కొన్నేండ్లుగా అక్కడక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. నాచు, నీటి మొ క్కలతో పాటు నత్తలు, చిన్న చేపలను తింటాయని తెలిపారు. ఈ చేపను ఎవరూ తినరని, భారత్తో పాటు శ్రీలంక వంటి దేశాల్లో ఈ చేపను నిషేధించినట్లు చెప్పారు.