దుందుభి నదిలో అరుదైన చేపలు

  • వలకు చిక్కిన మలగమేను, డెవిల్  రకాలు

ఉప్పునుంతల, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా కృష్ణా ఉపనది అయిన దుందుభి నదిలో ఓ జాలరికి రెండు అరుదైన చేపలు దొరికాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి సమీపంలోని దుందుభి నదిలో ఆదివారం చేపల వేటకు వెళ్లిన చీమర్ల మణిందర్ కు వలలో రెండు అరుదైన చేపలు చిక్కాయి. ఒకటి పాము ఆకారంలో ఉన్న మలగమేను కాగా, మరొకటి చెన్నై మెరీనా బీచ్ లో కనిపించే అరుదైన జాతి డెవిల్  రకం కావడం గమనార్హం. 

మలగమేను చేప అరుదుగా లభిస్తుందని, దీని విలువ ఎక్కువగా ఉంటుందని, దీనిని ఔషధంగా వాడుతారని చర్చించుకుంటున్నారు. పాము ఆకారంలో ఉన్న మలుగుమేను చేప 2 కేజీల 250 గ్రాములు ఉంది. ఇదే ప్రాంతంలో నాలుగేండ్ల కింద మలుగమేను చేప లభించినట్లు మత్స్యకారులు తెలిపారు.  ట్లు ఆయన తెలిపారు. అరుదైన రెండు రకాల చేపలు ఒకేసారి దొరకడంతో వాటిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.