కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్‌లోని రెనే హాస్పిటల్‌లో బుధవారం 10 రోజుల వయస్సున్న శిశువుకు అరుదైన గుండె ఆపరేషన్ చేసినట్లు చైర్మన్ డాక్టర్ బంగారు స్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ రెనే హాస్పిటల్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో 10 రోజుల వయస్సు, 900 గ్రాముల బరువున్న శిశువుకు పీడీఏ క్లోజర్(గుండెకు రంధ్రం) ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.
కరీంనగర్ వైద్య చరిత్రలో గతంలో 1200 గ్రాముల వయస్సున్న శిశువుకు ఇలాంటి అపరేషన్ చేశామని, ప్రస్తుతం 900 గ్రాముల బరువు ఉన్న శిశువు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు రాజావిజయేంద్రరెడ్డి, డా.దినకర్, శ్రవణ్ కుమార్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.