హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం జీపీ పరిధి అడవిలోని ఓ గుడిలో అరుదైన లక్ష్మీసమేత యోగానంద నారసింహుని విగ్రహం లభ్యమైంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్, అన్వర్ పాషా, కిరణ్, శ్రీనివాస్ గౌడ్ ఈ విగ్రహాన్ని గుర్తించారు. యాదగిరిగుట్ట, పెన్ పహాడ్, హంపీలోని యోగానందుని ప్రతిమలు ప్రసిద్ధమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు.
కఠినమైన శిలలో శిల్పం చెక్కడం సాహసమేనని అన్నారు. నరసింహ స్వామి గుడి పక్కన రాతిగుండుకు చెక్కిన భైరవుని శిల్పముందన్నారు. 2 శిల్పాల్లో భైరవుడు చాళుక్య కా లానికి, నారసింహ స్వామి విగ్రహం 16వ శతా బ్దానికి చెందినవని చెప్పారు. ఈ దేవా లయానికి దగ్గరలో ప్రసిద్ధమైన మల్లూరు నారసింహ స్వామి టెంపుల్ ఉంది.