కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలి : శ్రీనివాసులు

కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలి : శ్రీనివాసులు

గద్వాల, వెలుగు: కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు కోరారు. శనివారం ఎంఎంఎల్​డీ డిగ్రీ కాలేజీలో పౌరసరఫరాల శాఖ, కామర్స్ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. వినియోగదారుల చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. 

ఆన్ లైన్ షాపింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొన్నవాటిలో క్వాలిటీ లేకపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. అనంతరం వినియోగదారుల రక్షణ అనే అంశంపై నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీలో గెలుపొందిన స్టూడెంట్స్ కు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ రేవతి, డీఎం మంజుల, ప్రిన్సిపల్ శ్రీపతి నాయుడు పాల్గొన్నారు.