ఆప్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణే: జైరాం రమేశ్​

ఆప్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణే: జైరాం రమేశ్​

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు నిదర్శనం కాదు.. కేవలం కేజ్రీవాల్, ఆప్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే. 2030లో ఢిల్లీలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 2015, 2020లో మోదీకి  బాగా ప్రజాదరణ ఉన్నా అప్పుడు ఢిల్లీలో ఆప్ గెలిచింది. 

ఇప్పుడు మోదీ పాపులారిటీ తగ్గినా ఢిల్లీలో ఆప్ ఓడిపోయింది. ఢిల్లీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడానికి మోదీ విధానాలు కారణం కాదని దీన్ని బట్టి  చెప్పవచ్చు. ఈ ఫలితాలు ఆప్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే.