పోలీసుల కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరారీ

కరీంనగర్ జిల్లాలో రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఈ ఘటన మధ్యాహ్నం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో లక్ష్మణ్ అనే వ్యక్తిపై దొంగతనం  కేసు నమోదైంది. గత నెల ఐదు నుంచి కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇవాళ విచారణ కోసం అతడిని జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. తిరిగి తీసుకొస్తుండగా జైలుకు కొద్దిగా దూరంలో బస్సు దిగిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుడు గతంలో అదిలాబాద్ జిల్లాలోనూ ఇలాగే పారిపోయినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.