నెల కింద పరారైన ఖైదీ చిక్కిండు

హనుమకొండ, వెలుగు: నెల కింద పరారైన రిమాండ్​ఖైదీ చిక్కాడు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన ఆలకుంట రాజు మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య గట్టమ్మ(31)ను కొట్టేవాడు. 2019 ఆగస్టు 7న ఆమెతో గొడవపడి చంపేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఖమ్మం జైలుకు తరలించారు. గత నెల16న పోలీసులు రాజును హనుమకొండ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చారు. 

ఏఆర్​ఎస్సై బి.నర్సింహులు, తన సిబ్బంది కళ్లు గప్పి రాజు పరారయ్యాడు. రంగంలోకి దిగిన టాస్క్​ఫోర్స్ కు రాజు హైదరాబాద్ సిటీలో తిరుగుతున్నట్లు సమాచారం అందింది. టాస్క్​ ఫోర్స్​ సీఐ పవన్​ కుమార్, ఎస్సై నరసింహ ఖైదీ రాజును మంగళవారం పట్టుకున్నారు. సుబేదారి పోలీసులకు అప్పగించగా, వారు జైలుకు తరలించారు.