వెండి ధర  :  రూ.85 వేలకు!

హైదరాబాద్​, వెలుగు : రాబోయే 12 నెలల్లో వెండి ధర   పెరగబోతోందని, కిలో ధర ధర రూ.85 వేల వరకు చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిపోర్ట్ తెలిపింది. 2023 మొదటి నాలుగు నెలల్లో దీని ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం దీని ధర రూ.77 వేల వరకు ఉంది. రాబోయే కొన్ని క్వార్టర్లలో మరో 15 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది.  మొదట రూ.82 వేల వరకు.. తర్వాత రూ.85 వేల వరకు చేరే చాన్స్​ ఉందని మోతీలాల్ ఓస్వాల్  తెలిపింది.