బాత్ రూమ్​లో జారిపడి కువైట్​లో మెదక్ జిల్లా వాసి మృతి

బాత్ రూమ్​లో జారిపడి కువైట్​లో మెదక్ జిల్లా వాసి మృతి

నిజాంపేట, వెలుగు : బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన మెదక్  జిల్లా యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...  నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన పాపయ్యగారి బాబు ( 30 ) ఆరేళ్ల కింద కువైట్ వెళ్లాడు. అక్కడ కోకాకోలా కంపెనీలో వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు.

బాబు మూడు రోజుల క్రితం తాను నివాసం ఉంటున్న గదిలోని బాత్ రూమ్ లో జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని అతని సహోద్యోగులు హాస్పిటల్ లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. మృతునికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. బాబు డెడ్​ బాడీని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని కంపెనీ యాజమాన్యం తెలిపిందని కుటుంబ సభ్యులు చెప్పారు.