
నారాయణ్ ఖేడ్, వెలుగు: తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న నారాయణఖేడ్ కు చెందిన గుండు శివకుమార్ ను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదివారం సన్మానించారు. రావి ఆకుపై 8 నెలలుగా 1000 మందికి పైగా చిత్రాలు గీసి ఔరా అనిపించాడని ప్రశంసించారు. అతడి కళా నైపుణ్యం మరెందరరికో ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో దారం శంకర్, పరమేశ్వర్, రమేశ్ చౌహాన్ పాల్గొన్నారు.