దేవునూర్ ఇనుపరాతి గట్లను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి

దేవునూర్ ఇనుపరాతి గట్లను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి

ధర్మసాగర్, వెలుగు: దేవునూర్ ఇనుపరాతి గట్లను రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని విశ్రాంత అటవీ అధికారి పురుషోత్తం అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక, యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ధర్మసాగర్ మండలంలోని దేవునూర్​ ఇనుప రాతి గట్లలో ట్రిక్కింగ్ నిర్వహించారు. 

అనంతరం భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత అను అంశాన పర్యావరణ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం రాష్ట్ర కన్వీనర్ ధర్మ ప్రకాశ్ రచించిన "దేవునూర్​ ఇనుపరాతి అటవీ గట్టు హనుమకొండ కే ఆయువు పట్టు" అనే బుక్ లెట్ ను ఆవిష్కరించారు. శ్రవణ్ కుమార్, దుర్గాచార్యుల పర్యావరణ గీతాలు, కవితలు ఆహుతులను అలరించాయి. 

అంతకుముందు దివంగత ప్రకృతి ప్రేమికులు నల్లల రాజయ్య, ఎగ్గని నాగయ్యకు సంతాపం తెలిపారు. సదస్సు ప్రధాన వక్త విశ్రాంత జంతుశాస్త్ర ఆచార్యులు డాక్టర్ రాములు, జన విజ్ఞాన వేదిక, పర్యావరణ క్లబ్ల నుండి, రవీందర్ కిషోర్, నాగార్జున, తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలల ఆచార్యులు కుర్షిత్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.