ఆటోను ఢీకొట్టిన ఎస్సై కారు..ఐదుగురికి తీవ్రగాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (జనవరి 10, 2025) పాల్వంచ మండలం జగన్నాధ పురం వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు పాల్వంచ ఎస్ రామారావుదిగా గుర్తించారు. 

ముక్కోటి ఏకాదశి విధులు ముగించుకొని వస్తున్న ఎస్ ఐ రామారావు కారు జగన్నాథపురం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో భద్రాచలం నుంచి వస్తున్న ట్రాఫిక్ ఎస్ ఐ  వాహనంలో గాయపడ్డవారిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదసమయంలో ఎస్సై రామారావు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తు్న్నట్లు స్థానికులు తెలిపారు.