బేగంపేట మెట్రో స్టేషన్ దగ్గర యాక్సిడెంట్.. పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్

సికింద్రాబాద్ : బేగంపేట, పంజాగుట్ట మార్గ మధ్యలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై  బేగంపేట్ నుంచి పంజాగుట్ట వైపు వస్తున్న తండ్రీకూతురు టెంపో వాహనాన్ని ఢీ కొట్టి రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో కూతురు ప్రసన్న అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

గాయపడిన వ్యక్తి మణుగూరుకి చెందిన SPF ఎస్సై శంకర్రావు గా పోలీసులు గుర్తించారు. వారు హాస్పిటల్ కు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. దీంతో బేగంపేట్ నుంచి పంజాగుట్ట వేళ్లే ప్రధాన రోడ్డు మార్గం భారీగా ట్రాఫిక్ జామ్  అయ్యింది. కీలో మీటర్ దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం ఆఫీస్ లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటన్నరకు పైగా ట్రాఫిక్ లో ప్రయాణీకులు చిక్కుకున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.