బ్రిడ్జ్‌ను ఢీకొన్న లారీ.. పల్టీలు కొట్టింది

భైంసా మండలంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా మండలంలోని మటెగాం గ్రామ సమీపంలోని భైంసా--- నిర్మల్ జాతీయ రహదారిపై బిడ్జ్ ని లారీ ఢీకొట్టింది. గుజరాత్ నుంచి విజయవాడకు టైల్స్ లోడ్ తో వస్తు్న్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జ్ ని ఢీకొట్టింది. బిడ్జ్ పై లారీ బోల్తా పడడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బాసర, ముధోల్ వైపు వెళ్లే వాహనాలను కుంటాల మండలంలో ఆర్లి ఎక్స్ రోడ్డు వద్ద దారి మల్లిస్తున్నారు. భైంసాకు వచ్చే వాహనాలను మాటేగాం నుంచి చింతల్ బోరి, మహాగం మీదుగా భైంసా కు తరలిస్తు్న్నారు.