కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మహిళా కూలీలు మృతి

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. చనిపోయిన వారిలో లింగమ్మ (42) , తిరుపతమ్మ (43) ఉన్నారు. మృతులు బీరంగూడ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. 

ఈ ప్రమాదాన్ని చూస్తూ.. ఓ వ్యక్తి టాటా ఏస్ వాహనం నడుపుతుండగా మరో ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యంగా టాటా ఏస్ వాహనం నడపడంతో వాహనం బోల్తా పడింది. మొదటి ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగింది. 

విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇద్దరు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.