ఏపీ అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.
వీరంతా అనంతపురం రాణి నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ లో పెళ్లి బట్టలు కొనుగోలు చేసి అనంతపురం తిరిగి వస్తుంటే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.