టిప్పర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి

టిప్పర్ ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు యువకులు మృతి

సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లాపూర్ హుడా లే అవుట్ దగ్గర టిప్పర్ యూటర్న్ చేస్తుండగా   అతివేగంగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.  

 ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు . మృతులు హరీష్ (19), బన్నీ (20) ఇంద్రారెడ్డి కాలనీ వాసులుగా గుర్తించారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను పటాన్ చేరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.