viral video : చైనాలో రాకెట్ కూలిపోయింది : గాల్లోనే రెండుగా ముక్కలు

viral video : చైనాలో రాకెట్ కూలిపోయింది : గాల్లోనే రెండుగా ముక్కలు

చైనాలో ఓ ప్రైవేటు  ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ X తయారు చేసి ప్రయోగించిన రాకెట్ కూలిపోయింది. రాకెట్లోని కంప్యూటర్ కూడా పని చేయకపోవడంతో రాకెట్ కూలిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ప్రయోగం ఫెయిల్యూర్ అయింది. నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లో బ్లాస్ట్ అయి దగ్గరిలోని అడవుల్లో పడింది. ఆదివారం చైనీస్ టియాన్లాంగ్- 3 రాకెట్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో ప్రయోగం చేపట్టారు.

అంతరిక్షంలోకి వెళ్లక ముందే లాంచ్ ప్యాడ్ కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కూలిపోయింది. రాకెట్ బాడీ.. టెస్ట్ బెంచ్ మధ్య కనెక్షన్లో నిర్మాణ ఫెయిల్ అయ్యినందుకే రాకెట్ గాల్లోకి ఎగిరిన 30 సెకండ్లలో బ్లాస్ట్ అయ్యిందని ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ X సైంటిస్టులు చెప్పారు. ఈ పేలుడుతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.