కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి హత్య.. ఘటనా స్థలంలో కొడుకు తుపాకీ

ఉత్తరప్రదేశ్‌ లక్నోలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఇంటి వద్ద ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 1న) కేంద్రమంత్రి నివాసం వద్ద ఓ యువకుడిని కాల్చి చంపారు. విషయం తెలియగానే పోలీసులు కేంద్రమంత్రి ఇంటికి వెళ్లారు. ఘటనా స్థలం నుంచి మంత్రి కుమారుడి పేరుతో ఉన్న లైసెన్స్‌డ్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు వికాస్ శ్రీవాస్తవగా గుర్తించారు. కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు..  వికాస్ శ్రీవాస్తవ స్నేహితులని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం యువకుడి డెడ్ బాడీని ప్రభుత్వ మార్చురీకి తరలించారు.

ALSO READ:తాజ్ హోటల్‌ను పేల్చేస్తాం...పోలీసులకు బెదిరింపు కాల్

ప్రస్తుతం యువకుడి మర్డర్ ఘటన లక్నోలో సంచలనం రేపుతోంది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. యువకుడి మర్డర్ కు అసలు కారణమేంటి..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.