బేగంపేట ఫ్లై ఓవర్​పై రన్నింగ్ కారులో మంటలు

సికింద్రాబాద్, వెలుగు: నడుస్తున్న కారులో మంటలు చెలరేగిన ఘటన బేగంపేట ఫ్లై ఓవర్​పై శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈసీఐఎల్​ పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన రవీందర్ దంపతులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఎప్పటిలాగే హైటెక్​ సిటీలో ఇద్దరు డ్యూటీకి వెళ్లి వస్తుండగా, బేగంపేట ఫ్లైఓవర్​పైకి రాగానే కారు ఇంజన్​నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించారు.

వెంటనే రవీందర్​ కారును పక్కకు ఆపి బానెట్​లేపి చూడగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తన భార్యను బయటకు దింపి డయల్​100కు కాల్ చేశారు. పోలీసులు, ఫైర్​సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.