
శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో అయోధ్య రామ శర్మ ఆధ్వర్యంలో ధర్మం పరిరక్షణ, లోక కల్యాణం కోసం నాలుగు రోజులపాటు యాగం నిర్వహించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య మంగళవారం యాగం ప్రారంభమైంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.