కరెంట్ షాక్‌తో గ్రామపంచాయితీ వర్కర్ మృతి

వికారాబాద్ జిల్లా : పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటప్ప విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. ఎలక్ట్రిషియన్ గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ అమర్చుతుండంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. గ్రామంలో స్తంభాలకు వీధిదీపాలను అమర్చేటప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి.. ఎల్సీ తీసుకున్నా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ విద్యుత్ సరఫరా చేయడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.

 ఇదిలా ఉండగా గ్రామపంచాయతీ కార్మికులు విద్యుత్ షాక్ తో చనిపోయిన సంఘటన తెలుసుకున్న తాండూరు విద్యుత్ శాఖ ఏడి ఆదినారాయణ జిల్లా ప్రభుత్వాసుపత్రికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఏ డి ఆదినారాయణ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ తరపున మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని  పేర్కొన్నారు.