జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. కాటారం మండల కేంద్రంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గారెపల్లికి చెందిన తోట రవి అనే యువకుడిని ఢీకొన్న లారీ అతనిపై నుంచి దూసుకుపోయింది. దీంతో యువకుడి రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ఇసుక లారీతో పరారయ్యాడు. భాధితుడికి న్యాయం చేయాలంటూ ప్రదాన రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఇసుక క్వారీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలతో ఇరువైపుల న ఆర్టీసీ బస్సులు, వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.