
మహబూబాబాద్ జిల్లాలో ఓ స్కూలు బస్సు బోల్తా పడింది. కేసముద్రం మండలంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్కూలు బస్సు కండీషన్ బాగోలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ప్రమాదం జరిగిన తీరును చూసి స్థానికులు షాక్ అయ్యారు. అదృష్టవశాత్తు విద్యార్థులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు విద్యార్థులు ఈ ఘటనను నుంచి ఇంకా తేరుకోవడం లేదు.