- మరో 13 మందికి గాయాలు.. చైనాలో ఘటన
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్టూడెంట్లు, వారి పేరెంట్స్మీదికి స్కూల్‌బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. మరో 13 మంది గాయాలపాలయ్యారు. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో గల తైయాన్ నగరంలో మిడిల్ స్కూల్ గేట్ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన అద్దె బస్సు నియంత్రణ కోల్పోయి విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైకి దూసుకెళ్లిందని పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వారిలో స్టూడెంట్లు, కొందరు పేరెంట్స్ఉన్నారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించారు.
గాయపడిన 13 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులుబస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారని అక్కడి ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక పిల్లలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా? అనేది స్పష్టంగా తెలియరాలేదు.